శ్రీగురుభ్యో నమః
మహాగణాధిపతయే నమః
మహాసరస్వత్యై నమః
----------------------------------------------------
శ్రీవిద్యానిలయా సుధీకువలయశ్రేణీసుధాంశూదయా
దేవానీకకృపాలయా దురితసందేహాంధభానూదయా
ప్రావీణ్యంబిడుమా కవిత్వమహిమన్ రాగప్రమోదాలయా
నావాక్కాలయమౌను నీకు జననీ ధౌతద్యుతీ భరతీ
మాతృపాదయుగము పితరుని పాదాలుశ్రీవిద్యానిలయా సుధీకువలయశ్రేణీసుధాంశూదయా
దేవానీకకృపాలయా దురితసందేహాంధభానూదయా
ప్రావీణ్యంబిడుమా కవిత్వమహిమన్ రాగప్రమోదాలయా
నావాక్కాలయమౌను నీకు జననీ ధౌతద్యుతీ భరతీ
పద్యమందు నాల్గుపాదములుగ
గురువులయ్యె నాదు గురువుల దీవెనల్
లఘువులయ్యె నాదు శ్రమములెల్ల
కరిముఖముతోడనెవ్వడు
పరిపంథుల పారద్రోలి పరగతినొసగున్
హరసుతుని వాని గొల్చెద
సరసగిరన్ రసనమందు స్థాపించుటకై
ఇందున నే పద్యమ్ముల
నందంబుగ వ్రాసి కూర్చ యత్నము జేతున్
విందుగ విచ్చిన యుల్లపు
కెందమ్మిలొ వాగ్వధూటి కేళిన్ సలుపన్
No comments:
Post a Comment